Nov 12,2019 11:15AM
జైపూర్: రాజస్థాన్‌లోని సాంబార్ లేక్ వద్ద 1000 వరకు పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. పక్షులు మృతి చెందినట్టు తెలిపారు. మన ప్రాంతానికి చెందని పక్షులే కాకుండా వలస వచ్చిన పక్షులు కూడా మృతి చెందినట్లు నిర్దారించామని అన్నారు. సరస్సులోని నీటిని పరీక్ష చేయడానికి ల్యాబ్ కు పంపినట్టు తెలిపారు. పక్షులు మృతి చెందాడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్టు పేర్కొన్నారు.