Nov 12,2019 11:53AM
చండీగర్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ అమృత్ సర్‌లోని గురుద్వారాలో ప్రార్ధనలు చేసారు. నేడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఆయన గురుద్వారాలో ప్రార్ధనలు నిర్వహించారు. గురునానక్ జయంతి సందర్భంగా పంజాబ్ లో ఉన్న స్వర్ణ దేవాలయానికి సిక్కులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.