హైదరాబాద్: కలకాలం కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో, కోపంతో రగిలిపోయిన భర్త, తనను తాను అదుపు చేసుకోలేక భార్యను తలపై బలంగా బాది, హత్య చేశాడు. ఈ ఘటన దుండిగల్ పరిధిలోని సూరారంలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. బస్వరాజు శిల్ప(38), ఆమె భర్త బస్వరాజు రాజ్‌కుమార్(45). వృత్తిరీత్యా ఆయన ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య రాత్రి చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్తా, మాటా మాటా పెరిగి పెద్దదయింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ ఆయన భార్య తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పొద్దున కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. ఆమె విగతజీవిగా పడి ఉంది. సమాచారమందుకున్న పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 711, 302, 498 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కింద అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Nov 12,2019 06:50PM