Nov 12,2019 09:24PM
వరంగల్: దామెర మండలం ముస్తాలపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్ మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నారు. నెల క్రితం భార్య అతన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో మహేష్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని స్థానికులు చెబుతున్నారు.