Nov 12,2019 09:53PM
హైదరాబాద్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో భారత క్రికెటర్లు కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు నెంబర్ వన్లుగా నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 895 పాయింట్లతో నెంబర్ వన్ గా కొనసాగుతుండగా, బౌలింగ్ విభాగంలో బుమ్రా అగ్ర స్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఈ ఏడాది అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న రోహిత్ శర్మ 863 పాయింట్లతో రెండో స్థానం పొందాడు. మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అఫ్గాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహమాన్ ఒక స్థానం మెరుగుపడి 707 పాయింట్లో మూడో స్థానంలో నిలిచాడు. సఫారీ బౌలర్ ఒక స్థానం కిందికి దిగజారి 694 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.