Nov 12,2019 10:01PM
ముంబై: తనను ఆంటీ అని పిలిచిన బాలుడిని దూషించి విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి స్వరభాస్కర్ వివరణ ఇచ్చింది. తాను ఆ బాలుడిని సరదాగానే అలా అన్నట్టు పేర్కొంది. ఓ కామెడీ షోలో పాల్గొన్న తాను సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నానని, వ్యంగ్యంగా చెప్పే క్రమంలో ఆ భాషను ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తాను సరదాగా అన్న వ్యాఖ్యలపై ఇంత రాద్ధాంతం ఎందుకో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనెప్పుడూ చిన్నారులను, సహ నటులను దూషించలేదని పేర్కొంది.