గుంతకల్లు : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రేణిగుంట- శివమొగ్గ టౌన్ (వయా గుంతకల్లు)కు ఆరు ట్రిప్పుల వీక్లీ ప్రత్యేక రైలును వేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. శివమొగ్గ టౌన్-రేణిగుంట వీక్లీ ప్రత్యేక రైలు (నెం. 06223) ఈ నెల 13, 20, 27 తేదీల్లో (బుధవారాలలో) నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు శివమొగ్గ టౌన్ స్టేషన్‌లో ఉదయం 6-10 గంటలకు బయలుదేరి బళ్లారికి మధ్యా హ్నం 1-10 గంటలకు, గుంతకల్లుకు మధ్యాహ్నం 2-05 గంటలకు చేరుకుని అదేరోజు రాత్రి 8-05 గంటలకు రేణిగుంటకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06224) 13, 20, 27 తేదీల్లో రేణిగుంటలో రాత్రి 9- 45 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు అర్ధరాత్రి (గురువారం) 2-10కి, బళ్లారికి తెల్లవారుజాము 3-45 గంటలకు చేరుకుని ఉదయం 11-45 గంటలకు శివమొగ్గకు చేరుతుందన్నారు. ఈ రైళ్లు భద్రావతి, తరికెరె, బీరుర్, అజ్జంపు ర, హోసదుర్గ రోడ్డు, చిగ్జాజుర్, చిత్రదుర్గ, మొలకల్మూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట స్టేషన్ల మీదుగా గమ్యానికి చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు
Nov 13,2019 06:32AM