Nov 13,2019 06:00PM
హైదరాబాద్ : ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఈ రోజు సంభవించిన పేలుళ్లలో ఏడుడగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఓ కారులో బాంబు లు పేలాయి. పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాంబు పేలుళ్ల ధాటికి అక్కడున్న పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.