Nov 13,2019 11:02PM
సిద్దిపేట: ఇద్దరు చిన్నారులు పురుగుల మందు తాగిన ఘటన సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, నర్సాయపల్లిలో చోటుచేసుకుంది. చిన్నారులు తుమ్మల భాస్కర్(12), బన్నీ(11) పురుగుల మందు తాగి, అపస్మారక స్థితికి చేరారు. విషయం గమనించిన వారి కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వారిలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బతికున్న బాలుడిని మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.