Nov 14,2019 11:33AM
ఇండోర్: భారత పేసర్ల దెబ్బకు బంగ్లా జట్టు విలవిలలాడుతోంది. ఇండోర్ హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో ఉన్న బంగ్లా జట్టుకు మరో షాక్ తగిలింది. భారత పేసర్ షమీ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి బంగ్లా బ్యాట్స్‌మెన్ మహ్మద్ మిథున్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిథున్ 36 బంతుల్లో 13 పరుగులు చేశాడు. మిథున్ పెవిలియన్ బాట పట్టడంతో ముష్ఫికర్ రహీమ్ క్రీజులోకొచ్చాడు. 50 పరుగుల లోపే మూడు కీలక వికెట్లను బంగ్లాదేశ్ జట్టు కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.