Nov 14,2019 02:21PM
న్యూఢిల్లీ: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టుపై భారత బౌలర్లు విరుచుపడుతున్నారు. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే ఓపెనర్‌లను కోల్పోయిన బంగ్లా జట్టు.. పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడానికి బంగ్లా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ మోమినుల్ హక్ క్లీన్‌బౌల్డ్ అయిన కొదిసేపటికే ఆ జట్టు మరో వికెట్‌ను కోల్పోయింది. 45వ ఓవర్‌లో అశ్విన్ విసిరిన తొలి బంతికి బంగ్లా బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా వెనుదిరిగాడు. 53 ఓవర్లో మహ్మద్ షమి బౌలింగ్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాయి. ప్రస్తుతం 54 ఓవర్లకు 140/7 పరుగులుగా ఉంది.