Nov 14,2019 04:01PM
న్యూఢిల్లి : ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్నషెల్టర్‌హోంలో బాలికలపై లైంగిక దాడుల కేసులో కోర్టు తీర్పు నేడు వెలువడాల్సి ఉంది. న్యాయవాదులు సమ్మె చేస్తుండటంతో తీహార్ జైలు నుంచి 20 మంది నిందితులను కోర్టుకు తీసుకు రాలేదు. దీనితో అడిషనల్ సెషన్స్ జడ్జి సౌరభ్ కులశ్రేష్ట తీర్పును డిసెంబర్ 12కు వాయిదా వేశారు.