Nov 14,2019 07:21PM
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సరికొత్త ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భారత మార్కెట్‌లో వివో యూ20 స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 22న విడుదల చేయనుంది. వివో యూ20 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్, 675 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, ఫాస్ట్ యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ ఉంటుంది. వివో యూ20 స్మార్ట్‌ఫోన్ రూ. 15,000కే లభించనుంది. ఇటీవల కాలంలో వివో యూ10 ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేశారు. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 8,990, 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 9,990 ఉంటుంది.