Nov 14,2019 07:50PM
హైదరాబాద్ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికి కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమిస్తుందని ఆశిస్తున్నానంటూ ట్విట్ చేశారు.. దీంతో పాటే 'సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ తీర్పు సందర్భంగా విడుదల చేసిన డాక్యుమెంట్ ను పోస్ట్ చేశారు రాహుల్. 'సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ దీనిపై విచారణ జరపడానికి తలుపులు తెరిచే ఉంచారు. పూర్తి స్థాయిలో విచారణ మొదలవ్వాలి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జేపీసీని కూడా తప్పకుండా నియమించాల్సి ఉంటుంది' అని ట్విట్ లో పేర్కొన్నారు.