Nov 15,2019 09:59AM
హైదరాబాద్ : హైదరాబాద్ లోని నిమ్స్ లో స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు ఆందోళనకు దిగారు. పదోన్నతుల అంశంలో మెడికల్ సూపరింటెండెంట్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన నర్సు నిర్మలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రత్యేక బ్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు.