Nov 15,2019 10:17AM
గుంటూరు: టీడీపీ నాయకుడు ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో జరిగింది. తెలుగుదేశం నాయకుడు కుమ్మెత కోటిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఓ దాడి కేసులో పోలీసులు కోటిరెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కోటిరెడ్డి గురువారం అర్ధరాత్రి స్టేషన్‌లో ఉన్న డెటాల్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.