Nov 15,2019 10:27AM
హైదరాబాద్: పండ్ల దుకాణంలో తెల్లవారుజామున చెలరేగిన మంటలు నాలుగు దుకాణాలకు పాకాయి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రైతు బాజార్ ముందు రోడ్డుపై ఉన్న పండ్ల దుకాణాల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో హటాత్తుగా ఒక దుకాణానికి అంటుకున్న మంటలు సుమారు 4 దుకాణాల వరకూ వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.