Nov 15,2019 09:12PM
అమరావతి: టీడీపీ నేత కోటిరెడ్డిని అకారణంగా అరెస్టు చేశారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిరెడ్డి ఏ తప్పు చేయలేదని గత ఎస్పీ చెప్పలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉమా.. నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తలపై 122 తప్పుడు కేసులు పెట్టారన్నారు. టీడీపీ నేతలను తిట్టిస్తూ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. సిమెంట్ కంపెనీల నుంచి జగన్ రూ.1000కోట్ల ముడుపులు తీసుకోలేదా అన్ని ప్రశ్నించారు. తమపై ఉన్న కోపంతో భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టద్దన్నారు.