Nov 16,2019 08:16PM
ముంబై: అమెరికాకు చెందిన మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అధికారి ఆపిల్ స్టోర్ నుంచి 181 వాపింగ్-సంబంధిత యాప్‌లను తొలగిస్తున్నట్లు ఆక్సియోస్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. సీడీసీ నివేదిక ప్రకారం వాపింగ్‌కు సంబంధించి ఊపిరితిత్తుల అనారోగ్యంతో కనీసం 42 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. వాపింగ్ ఉత్పత్తులను ఆపిల్ యాప్ స్టోర్ నుంచి నేరుగా అమ్మకాలు చేపట్టడంలేదు. జూన్ నుంచి కొత్త యాప్‌లను ఆపిల్ నిలిపివేసింది. ఇ-సిగరెట్లపై పెరుగుతున్న ఆరోగ్య సమస్యలతో ఆపిల్ తన అధికారిక యాప్ స్టోర్ నుంచి వాపింగ్ సంబంధిత యాప్‌లను తొలగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.