Nov 16,2019 09:42PM
హైదరాబాద్: 'జార్జిరెడ్డి' చిత్రం ముందస్తు విడుదల వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చిత్రబృందం అనుమతి కోరగా.. పోలీసులు అందుకు తిరస్కరించారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ హాజరవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. అభిమానులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరైతే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించారు. నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.