Nov 16,2019 11:12PM
హైదరాబాద్: ముద్దుగుమ్మ శ్రుతి హాసన్ రెండేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు తెలుగు ప్రాజెక్టుకు సంతకం చేశారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'క్రాక్' సినిమాలో ఆమె నటించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ ప్రాజెక్టులో నటించడం గురించి శ్రుతి హాసన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. 'బలుపు' సినిమా కోసం రవితేజతో కలిసి పనిచేశా. అప్పుడు చాలా సందడిగా, సరదాగా షూట్ సాగింది. ఇంకా నాకు ఆ రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణంలోనే షూట్ జరుగుతుందని ఆశిస్తున్నా. తెలుగు సినిమాలో నటించడం ఎప్పుడూ సంతోషమే. అని ఆమె అన్నారు.