Nov 17,2019 06:18AM
ఢిల్లీ: మోడీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోనియా అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ సభకు ''భారత్ బచావో ర్యాలీ'' అని పేరు పెట్టామన్నారు.