Nov 17,2019 08:23AM
గుంటూరు: మండలంలోని నందిగామలో ఉన్న పురుగుమందుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. మండలానికి నియమితులైన తనిఖీల ప్రత్యేక అధికారి, క్రోసూరు ఏడీఏ హనుమంతరావు, సత్తెనపల్లి ఏఓ శ్రీధర్‌రెడ్డిలు గ్రామంలోని పలు షాపుల్లోని రికార్డులను, పురుగుమందుల స్టాక్‌ను, అమ్మకాల లైసెన్స్‌లను పరిశీలించారు. లైసన్స్ల్లో పొందుపర్చని పురుగుమందులను గుర్తించారు. రూ. లక్షా 43 వేల 355 విలువైన పురుగుమందుల అమ్మకాల నిలిపివేతకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హనుమంతరావు మాట్లాడుతూ లైసెన్స్‌లో పొందుపర్చిన పురుగుమందులను మాత్రమే అమ్మాలని డీలర్లకు స్పష్టంచేశారు. ఇష్టం వచ్చినట్లుగా పురుగుమందులు అమ్మితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లోని పురుగుమందుల షాపులను తనిఖీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.