Nov 17,2019 11:45AM
నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో హైవేపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న గొర్రెల మందను తప్పించేందుకు స్లో అయిన లారీని వెనకాల నుండి స్పీడ్ గా వస్తున్న మూడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిచారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.