Nov 17,2019 12:24PM
హిమాచల్‌ప్రదేశ్: రాష్ట్రంలోని మండి జిల్లా పండో డ్యామ్ వద్ద కారు లోయలో పడింది. కారు లోయలో పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వడానికి ప్రయత్నించడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.