Nov 17,2019 03:03PM
హైదరాబాద్: మండలంలోని తిమ్మం పల్లిలో గొర్రెపిల్లల మేత కోసం వెళ్లిన కాపరి బాలపెద్దన్న (45) విద్యుదాఘాతంతో మృతి చెందినట్టు హెడ్‌కానిస్టేబుల్ రా ముడు తెలిపారు. బాలపెద్దన్న గొ ర్రె పిల్లలకు మేత తేవడానికి దగ్గరలో ఉన్న వేప చెట్టు వద్దకు వెళ్లాడు. కొమ్మలు విరుస్తుండగా అవి ప్రమాదవశాత్తు దగ్గరలో ఉ న్న విద్యుత్ తీగలను తగిలాయి. దీంతో వి ద్యుత్ సరఫరా జరిగి బాలపెద్దన్న అక్కడిక్క డే మృతి చెందాడు. ఇతడికి భార్య శివమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కు మారుడు ఇంటర్మీడియట్ చదువుతుండగా, మరొక కుమారుడు గ్రామంలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ప డిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.