Nov 17,2019 03:09PM
హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశంలో 8 అంశాలను ప్రస్తావించామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరంపై ప్రతిపక్షాలు తీరును అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏపీకి మెడికల్ కాలేజీలు కావాలని కోరామని, రూ.7వేల కోట్ల గ్రాంటు ఏపీకి బాకీ ఉన్న విషయాన్ని ప్రస్తావించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశామన్నారు. పోలవరం బకాయిలు విడుదల చేయాలని కోరామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.