Nov 17,2019 06:18PM
విజయవాడ: గత కొన్ని రోజులుగా నందమూరి యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. ఓ వైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మరోవైపు మంత్రి కొడాలి నాని ఇద్దరూ జూనియర్ ప్రస్తావన తెచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేయడం.. ఆపై జరిగిన పరిణామాలు.. ఇలా పలు విషయాలపై ఆ ఇద్దరూ నేతలు మాట్లాడారు.
అయితే తాజాగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. మా నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని వర్ల ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీలపై ప్రశ్నల వర్షం కురిపించారు.