ఇండోర్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు మరో చరిత్రాత్మక సమరానికి సన్నద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక డే నైట్ టెస్టు సన్నద్ధత కోసం ఆదివారం నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. బంగ్లా క్రికెటర్లు సైతం ఇదే మైదానంలో సాధన చేయనున్నారు. పింక్ టెస్టు కోసం రెండు టీమ్‌లు కూడా వచ్చే మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకోనున్నాయి. తొలిసారి డే నైట్ టెస్టు ఆడబోతున్న నేపథ్యంలో ఇరు జట్లు పరిస్థితులకు అలవాటు పడేందుకు గులాబీ బంతితో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ ఆరంభించారు. పింక్ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంపై క్రికెటర్లు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులను ఆదనపు ప్రాక్టీస్ కోసం ఇండోర్‌లోనే ఉన్నారు. చివరిదైన రెండో టెస్టు ఈనెల 22 నుంచి కోల్‌కతాలో జరగనుంది.
Nov 17,2019 06:24PM