ముంబయి: హైదరాబాద్‌కు చెందిన లఘు చిత్ర దర్శకుడు నంది చిన్ని కుమార్ అమితాబ్ చిత్రానికి లీగల్ నోటీసులు పంపించారు. సాకర్ ఆటగాడు విజయ్ బర్సే జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'జుంద్'. పదేళ్ల క్రితం నాగ్‌పూర్‌లోని మురికివాడల్లో నివసించే పిల్లల కోసం ఓ ఎన్జీవో ఏర్పాటుచేసి వారికి సాకర్ ఆట నేర్పించిన విజయ్ బర్సే పాత్రలో అమితాబ్ నటించనున్నారు. అయితే 'జుంద్' సినిమాలో తాను తెరకెక్కించాలనుకున్న అఖిలేష్ పాల్ కథను కీలకంగా చూపించాలని చిత్రబృందం అనుకుంటుందని ఇది కాపీరైట్ ఉల్లంఘనల కిందకు వస్తుందని, అందుకే 'జుంద్' దర్శకుడు నాగ్‌రాజ్ మంజులే, టీ సిరీస్ ఛైర్మన్ డ ఎండీ భూషణ్‌కుమార్‌తోపాటు అమితాబ్ బచ్చన్, విజయ్ బర్సేకు లీగల్ నోటీసులు పంపించినట్లు వివరించారు. ఈ విషయంపై చిన్నికుమార్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. తాను పంపించిన లీగల్ నోటీసులకు టీసిరీస్ వాళ్లు మాత్రమే స్పందించారని, కాకపోతే అది కూడా చాలా అస్పష్టంగా ఉందని ఆయన అన్నారు. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే తాను త్వరలో కోర్టును కూడా సంప్రదించనున్నట్లు తెలిపారు.
Nov 17,2019 09:58PM