Nov 18,2019 01:40PM
హైదరాబాద్: ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని గాలికొదిలేసిందని ఏపీ మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పార్టీ నాయకులను భయపెట్టి టీడీపీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారన్నారు. ఆస్తులను కాపాడుకోవడానికే వంశీ వైసీపీలోకి వెళ్తున్నారన్నారు. జగన్ నవరత్నాల అమలుకు ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తున్నారన్నారు.