Nov 18,2019 02:07PM
న్యూఢిల్లీ : వాహనాలు తిరిగేందుకు ఇక సరి-బేసి విధానాన్ని పొడిగించడం ఇక అవసరం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడడమే ఇందుకు కారణమని తెలిపారు. వాహనాలకు సరి-బేసి విధానం అమలు చేస్తున్నప్పటికీ... వాతావరణ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదంటూ సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపధ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి సోమవారం నాటికి ఢిల్లీలో వాతావరణ పరిస్థితి మెరుగుపడినప్పటికీ... ఇంకా పూర్ కండిషన్‌లోనే ఉండడం గమనార్హం. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ వాతావరణం... 207 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) పాయింట్ల వద్ద ఉంది. ముందు రోజు(ఆదివారం) ఏక్యూఐ 254 గా ఉంది.