Nov 19,2019 07:40AM
ఒడిశా: ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గంజాయి తోటలపై పెద్ద ఎత్తున పోలీసులు దాడి చేశారు. గజపతి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గంజాయి పండిస్తున్నారని అందిన సమాచారం మేర సాయుధ పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేసి 462 ఎకరాల్లోని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి తోటలు సాగు చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గంజాయి మొక్కలను ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్న నేపథ్యంలో ఒడిశా పోలీసులు మూకుమ్మడి దాడులు చేసి, దీన్ని నిరోధించాలని నిర్ణయించారు.