Nov 19,2019 01:27PM
గుంటూరు: వైకాపా ప్రభుత్వ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే తెనాలిలో రోడ్లపై నిమ్మకాయలు పారబోస్తున్నారని విమర్శించారు. దుగ్గిరాలలో పసుపు కొనే పరిస్థితే లేదన్నారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండినా సాగునీటి సరఫరా మాత్రం అస్తవ్యస్థంగా ఉందని మండిపడ్డారు. వ్యవసాయం, పంటల సాగు, నీటి సరఫరా లాంటి అంశాలపై ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా? అని ఆయన ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో ప్రజల నోరు మూసేశారని.. రంగులు మార్చే పథకాన్ని మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.