Nov 19,2019 03:04PM
ఖమ్మం: ఇటీవల గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన విష్ణుకుమార్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అందజేశారు. నగరంలోని టీటీడీసీ భవనంలో మంగళవారం వ్వవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విష్ణుకుమార్ భార్య లక్ష్మికి ఈ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మినారాయణరాజు, జడ్పీఛైర్మన్ కమల్‌రాజు, కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.