Nov 19,2019 03:36PM
హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ అగ్రహారం పరిధిలోని కృష్ణా నదిలో మత్స్యకారులు మొసలి పట్టుకున్నారు. రెండు రోజుల నుంచి మొసలి కనిపిస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మత్స్యకారులు ఎట్టకేలకు మంగళవారం మొసలిని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.