Nov 19,2019 04:42PM
బెంగళూరు: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా వ్యక్తికి బెంగళూరు వాసులు దేహశుద్ధి చేశారు. మెల్‌బోర్న్‌కు చెందిన విలియమ్ కే జేమ్స్ బాదామి జిల్లాలోని కొనాన్‌కొప్ప ప్రాంతంలో ఓ మహిళ పట్ల అనుచితంగా, అభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన స్థానికులు జేమ్స్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. కొంతమంది స్థానికులు అతన్ని విడిపించి ఆస్పత్రికి తరలించారు. జేమ్స్ చారిత్రక కట్టడాల సందర్శన పూర్తయిన తర్వాత తాగిన మత్తులో కొంకాన్‌కొప్ప ప్రాంతానికొచ్చి..కొన్ని ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగిన మత్తులో జేమ్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.