Nov 19,2019 06:47PM
కరీంనగర్ : వివిధ విభాగాల్లో పనిచేసే వారిలో కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే సందేశాన్ని చేరవేస్తూ..ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నతాధికారి పొడేటి అశోక్ తన ఛాంబర్ లో 'నేను లంచం తీసుకోను' అనే బోర్డు తగిలించాడు. తహసీల్దార్ విజయారెడ్డి మృతి ఘటన అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అశోక్ కరీంనగర్ జిల్లాలో అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పొడేటి అశోక్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఎంతోమంది ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.