హైదరాబాద్: ఖానాపురం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం పనుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం మండలంలోని బుధరావుపేట గ్రామంలో ముప్ఫైరోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. ఎస్సీకాలనీ, గ్రామపంచాయతీ వీధి కలియతిరిగారు. డ్రైనేజీలు దుర్వాసన రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం నెలరోజుల్లో పూర్తిచేయాలన్నారు. వీధుల్లో చెత్త వేసే వారిపై జరిమానా విధించాలని సూచించారు. పాలకవర్గం నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్‌కు వెనుకాడనని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సమీపంలో మోడల్ స్కూల్‌ను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో తరగతిగదిలో మాట్లాడారు. 10 జిపీఎ సాధించాలని వారికి పలు సూచనలు చేశారు. ప్రత్యేక స్టడీ తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపల్ రవిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో నారాయణరావు, ఆర్డీవో రవి, ఎంపీపీ ప్రకాశరావు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Nov 19,2019 07:02PM