Nov 19,2019 07:28PM
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా పంట వ్యర్థాలను కాల్చిన కేసులో 16 మంది రైతులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పంటవ్యర్థాల కాల్చివేతకు సంబంధించి 300 కేసులు నమోదు చేశాం. రూ.13.05 లక్షల వరకు జరిమానా విధించాం. మధురలో 16 మంది రైతులను అరెస్ట్ చేశాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయతీ అధికారులను సస్పెండ్ చేశామని జిల్లా మేజిస్ట్రేట్ సర్వజ్ఞ రాం మిశ్రా తెలిపారు. ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాణాలు అంతకంతకూ తగ్గిపోతుండటంతో సరిహద్దు రాష్ర్టాల్లో పంట వ్యర్థాల కాల్చివేతలను తీవ్రంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే.