Nov 19,2019 11:39PM
న్యూఢిల్లీ: డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై భాజపా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆప్ సర్కార్ రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యేలు సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డిల్లీ మహా నగరంలోని చీకటి ప్రదేశాల్లో అమర్చేందుకు ఎల్‌ఈడీ బల్బుల సేకరణలో ఈ కుంభకోణం చోటుచేసుకున్నట్టు భాజపా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.