Nov 20,2019 08:56PM
అమరావతి: ఐటీ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సహానీ హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ చాలా ముఖ్యమని, ఈ వ్యవస్థలో సమాచార సాంకేతికత అత్యంత బలంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం జగన్ సూచించారు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని చెప్పారు. రేషన్‌కార్డు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీ చేస్తాయని సీఎం జగన్ తెలిపారు.