Nov 20,2019 11:21PM
హైదరాబాద్: అరుణ గ్రహంపై కీటకాల లాంటి ప్రాణులు ఉన్నాయని అమెరికాలోని ఓహియో వర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. మార్స్ రోవర్స్ పంపిన ఫోటోలను పరిశీలించిన తర్వాత ప్రొఫెసర్ ఎమిరేటస్ విలియమ్ రోమోసర్ ఈ విషయాన్ని తెలిపారు. కీటకాల్లాంటి ప్రాణులు చాలానే అంగారక గ్రహంపై ఉన్నట్లు ఆ శాస్త్రవేత్త గుర్తించారు. ఈగల్లాంటి కీటకాలు అక్కడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.