Nov 21,2019 07:42AM
హైదరాబాద్ : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల 25న హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ రెడ్‌క్రాస్ కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సొసైటీ ప్రధాన కార్యదర్శి మధన్ మోహన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్, సరస్వతీ మెమోరియల్ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్ 3(పురుషులు), స్టాఫ్ నర్స్(1), డేటా ఎంట్రీ ఆపరేటర్లు(2) పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.