Nov 21,2019 09:42AM
ఢిల్లీ : ఢిల్లిలో మరికాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. ఏఐసీసీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఎన్సీపీకి, శివసేనకు మద్దతు, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.