Nov 21,2019 09:53AM
హైదరాబాద్: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రాత్రి ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక ఒకటి నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.