Nov 21,2019 09:56AM
హైదరాబాద్: టెలికం సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. అప్పులతో సతమతమవుతున్నాం.. ఆదుంకోండని టెలికం సంస్థల చేసిన విజ్ఞప్తులకు కేంద్రం స్పందించింది. రెండేండ్లపాటు స్పెక్ట్రం చెల్లింపులపై మారటోరియం కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకుగాను స్పెక్ట్రం బకాయిలపై మారటోరియం ఇచ్చామని క్యాబినెట్ సమావేశం అనంతరం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులతో చెప్పారు. దీంతో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలకు రూ.42 వేల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ లభించినట్లు అయింది. టెలికం రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.