Nov 21,2019 10:53AM
ముంబయి : మహారాష్ట్రలోని పాన్వెల్ రైల్వేస్టేషన్‌లో ఇవాళ ఉదయం ఓ గర్భిణి ప్రసవించింది. నేరూల్ నుంచి పాన్వెల్ ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో పాన్వెల్ రైల్వేస్టేషన్‌లోనే గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. రైల్వేస్ పరిధిలో నిర్వహిస్తున్న వన్ రూపీ క్లినిక్ వైద్యులు ఆమెకు పురుడు పోశాడు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. గర్భిణికి పురుడు పోసిన వైద్యులు, రైల్వే సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.