మెదక్ : సొంత అన్నను హత్య చేసి తమ్ముడు పారిపోయిన సంఘటన గురువారం సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకుార్ గ్రామంలో చేసుకొనడముతొ స్థానికంగా కలకలం సృష్టించింది .వివరాల్లొకి వెళితే సదాశివపేట మండల పరిదిలొని ఆత్మకూరు గ్రామానికి చెందిన మృతుడు రాపోలు అమరెందర్(39) హైద్రాబాద్ ప్రాంతంలో జిలేబి బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు . మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇతనికి చిట్టిబాబు అనే తమ్ముడు ఉన్నాడు .అయితే మద్యానికి బానిస అయిన తమ్ముడు తరుచూ ఆస్తి కొసం అమరేందర్ తో గోడవపడేవాడని చంపేస్తానని చాలాసార్లు భెదిరింపులు చెసెవాడు .బుధవారం గ్రామంలో బంధువుల శుభకార్యానికి వచ్చిన అన్న తమ్ముళ్లు శుభకార్యం జరిగిన తరువాత మద్యం మత్తులో ఉన్న చిట్టుబాబు నిద్రిస్తున్నతన అన్న అమరెందర్ తలపై రొకలిబండతో బలంగా కొట్టి హత్య చేసి నిందితుడు పరారయ్యాడని స్థానిక సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు .సంఘటన విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్రెడ్డి సంఘట స్థలానికి విచ్చేసి పరిశీలించారు .మృతుడు తల్లి రాపోలు పుష్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Nov 21,2019 06:12PM