హైదరాబాద్: కొద్దిరోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారతారన్న ప్రచారంపై ఈటల స్పందించారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడేదిలేదని స్పష్టం చేశారు. గాలి వార్తలకు స్పందించనని కొట్టిపారేశారు. కొద్దిరోజులుగా ఈటెల పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన హుజురాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ 'ఒక్కొక్క రోజు నాలుగు.. నాలుగు జిల్లాల్లో ఇరవై ఇరవై సభల్లో లక్షల మందితో ఇంటరాక్ట్ అయి ఉద్యమం నడిపిన వాళ్లం మేము. మేం ఈ గులాబీ జెండాకు ఓనర్లం. మేం అడుక్కొచ్చినోళ్లం కాదు. బతికొచ్చినోళ్లం కాదు. మధ్యలో వచ్చినోళ్లం కాదు. గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద గుబాళింపజేసి మూడున్నర కోట్ల ప్రజల గొంతుకై.. ప్రజలు హర్షించే పద్ధతిలో పాత్ర నిర్వహించి.. రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలం. అందుకే మేం ఓనర్లం తప్ప.. అడుక్కొచ్చినోళ్లం కాదు' అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nov 22,2019 06:40PM